125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 29 : ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐ.కె.పి. సివిల్ సప్లయ్ శాఖలు కొనుగోలు క్దేంరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక వారం రోజుల లోపు అన్ని కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తామని తెలిపారు. జనగామలో 7కేంద్రాలు నేటి నుండి పనిచేస్తున్నాయని అన్నారు. జనగామ డివిజన్‌లో చేర్యాల, నర్మెట్ట, బచ్చన్న పేట మండలాలలో రెండు కేంద్రాల చొప్పున మద్దూరులో ఒక్క కేంద్రం నెలకొల్పోమని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఈ కేంద్రాలలో మౌళిక సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. వరి సన్న రకాలకు క్వింటాలుకు రూ. 1500/- ఎ-గ్రేడ్ 1280/- సాధారణ రకానికి రూ. 1250/- చెల్లించడం జరుగుతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో పండించే తెల్లమసూరి, విజయమసూరి (బి.టి.5204) రకాలకు రూ. 1500/- క్వింటాలుకు మద్దతు తధర లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సదిర్వనియోగం చేసుకోవాలని దళారిలకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎ.డి. శంకరయ్య, డి.ఎం. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మహిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.