ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు
విజయనగరం,సెప్టెంబర్5(జనం సాక్షి): ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్నతమైన విద్యా సేవలందించి పేరు పొందిన ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ చేతుల విూదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు.