13 ఏళ్ల దళిత బాలుడి కాళ్లకు సంకెళ్లు

ఆగ్రా: జువైనల్ వయస్సు గల బాల నేరస్థుల పట్ల పోలీసుల అరాచకాలు మితిమీరి పోతున్నాయి. జువైనల్స్ కు సంకెళ్లు వేయకూడదనే కనీస జ్హానాన్ని మరిచారు. ఓ మైనర్‌ను వేధించాడనే ఆరోపణలపై శనివారం నాడు పదమూడేళ్ల దళిత బాలుడిని మెయిన్ పురిలోని కోత్వాల్ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి కాళ్లకు సంకెళ్లు వేసి బంధించారు. ఓ మీడియా ప్రతినిధి పోలీసు స్టేషన్‌కు పనిమీద వెళ్లినపుడు లాకప్‌లో కాళ్లకు సంకెళ్లతో ఉన్న పదమూడేళ్ల బాలుని చిత్రాన్ని క్లిక్ మనిపించాడు. ఇది వాట్స్‌యాప్ ద్వారా వైరల్ కావడంతో విషయం వెలుగులోకొచ్చింది. అయితే ఈ కేసులో బాలుని తల్లిదండ్రులను కూడా ఇరికించారు. స్టేషన్ అధికారిని వివరాలు కోరగా.. ఈ విషయం తన దృష్టికొచ్చిందన్నారు. బాల నేరస్థులకు సంకెళ్ల వేయకూడదనేది తమకు తెలుసన్నారు. బాలున్ని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. vvi12