14వ తేదీన ఇంజీనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం  6గంటలకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు  వివరాలు వెల్లడిస్తున్నట్లు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రధానాధికారి చెప్పారు. ఎంపికైన కళాశాలల వివరాలు ఎన్‌ఎంఎస్‌ల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. అలాగే ఎంపికైన కళాశాలల్లో ఈ నెల 20 లోపు రిపోర్టు చేయకపోతే సీటు రద్దు చేస్తారు. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు.