14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌

ఢిల్లీ:  14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు  ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలుచేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని  మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్ర సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ములాయం సింగ్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, రాంవిలాస్‌ పాశ్వాస్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.  మొత్తం నాలుగు సెట్ల పత్రాలను ఆయన సమర్పించారు. ఒక్కో నామినేషన్‌పై 60 మంది ప్రతిపాదితులు, 60 మంది మద్దతుదారులతో సంతకాలు చేయించారు. తృణమూల్‌ మినహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.