14 నామినేషన్లు తిరస్కరణ

కడప, మే 27 ( (జనంసాక్షి):
జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రైల్వే కోడూరులో మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఐదు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 17 మంది నామినేషన్లను ఆమోదించారు. రాజంపేట నియోజకవర్గంలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 8 నామినేషన్లను తిరస్కరించారు. 20 నామినేషన్లను ఆమోదించారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలో 18 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్‌ తిరస్కరించారు. 17 మంది నామినేషన్లను ఆమోదించారు.