పందిళ్లపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఖమ్మం,(జనంసాక్షి): చింతకాని మండలం పందిళ్లపల్లిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కాంగ్రస్ నేతలు సీపీఎం నేత శ్రీనివాసరావును హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ 300 మంది పోలీసులను మోహరించారు. ఖమ్మం నుంచి శ్రీనివాసరావును మృతదేహంతో పందిళ్లపల్లికి సీపీఎం నేతలు రాలీగా బయల్దేరారు. పందిళ్లపల్లిని ఎస్పీ, ఏఎస్పీ సందర్శించారు.