15రోజుల్లోగా కార్మికుల సమస్య పరిష్కారం
విజయనగరం, ఆగస్టు 3 : శ్రీరాంపురం వద్ద గల స్టీల్ ఎక్సైజ్ ఇండియా లిమిటెడ్ (గోల్డ్‌స్టార్) యాజమాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు ఆశాజనకంగా సాగాయని సిఐటియుఏ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. గోల్డ్‌స్టార్ కూడలి సమీపంలో ఉన్న మామిడితోటలో కంపెనీ మోటార్ కార్మికుల సమావేశం నిర్వహించి చర్చలు సారాంశాన్ని వివరించారు. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడానికి యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు.