15న సర్వేశాం ఏకాదశి పూజలు
ఖమ్మం,ఫిబ్రవరి14(జనంసాక్షి): భద్రాచలంలోనూ శివరాత్రి ఉత్సవాలునిర్వహిస్తున్నారు. 15న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అభిషేకం, బంగారు పూల పూజ ఉంటుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. 17న శివరాత్రి పూజలు జరుగుతాయన్నారు. అనుబంధ ఆలయాల్లో వేంచేసిన లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో పూజలు చేశారు.