15 నుంచి సిపిఐ ప్రజాపోరు యాత్ర

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాపోరుయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు తెలిపారు. రెండువేల గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగునీరు ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రజాపోరు యాత్ర వివరాలను ఆయన తెలిపారు. మున్సిపాల్టీ పాలకవర్గాల పదవికాలం ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించడం లేదని, దీంతో మున్సిపాల్టీలలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కోసం ఈ నెల 23న చలో మున్సిపాల్టీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.