15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు

అందరికీ విద్య

నాణ్యమైన విద్య నినాదాంతో ముందుకు

నాలుగేళ్లలో 33కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చాం

అన్ని రాష్టాల్ర కంటే ఏపీకే అధికస్థాయిలో విద్యాలయాలు మంజూరుచేశాం

విజయవాడకే వచ్చి ఈ విషయాన్ని వెల్లడిస్తా

కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జయదేకర్‌

న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడారు. దేశంలో విద్యాభివృద్ధి కోసం ఈ నాలుగేళ్లలో మోదీ నేతృత్వంలో 33 కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చామని తెలిపారు. అందరికి విద్య – నాణ్యమైన విద్య నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు సిలబస్‌ తగ్గించి సామాజిక విద్య నేర్చుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు, నైపుణ్యాల శిక్షణకు చోటు కల్పిస్తామన్నారు.మధ్యాహ్న భోజనం, స్వచ్ఛ విద్యాలయాలు వంటి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఏడాదిలో బాలికలకు ప్రత్యేకంగా 2 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. 5, 8 తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని రాష్టాల్రకు సూచించామని గుర్తు చేశారు. వెనుబడిన జిల్లాల్లో డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కొత్తగా బీఏ బీఈడీ, బీకాం బీఈడీ.. రెండు ప్రొఫెషనల్‌ కోర్సులు తీసుకువస్తున్నామని వెల్లడించారు. అన్ని రాష్టాల్ర కంటే ఎక్కువ స్థాయిలో ఆంధప్రదేశ్‌కే విద్యాలయాలు మంజూరు చేశామని తెలిపారు. విజయవాడకే వచ్చి మిగిలిన రాష్టాల్ర కంటే ఎక్కువ ఇచ్చామో లేదో చెప్తానని జవదేకర్‌ పేర్కొన్నారు.