-->

16 నాటికి ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సంతాపం తెలిపాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఎల్లుండికి సభలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం లోక్‌సభలో సమావేశం ప్రారంభమయ్యాక చర్చ జరుగుతుండగా అస్సోం, ముంబాయి ఉదంతాలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రభుత్వం బదులివ్వాలని నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 3.30 గంటల సమయంలో కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ కన్నుమూత సమాచారం అందడంతో సభను గురువారం నాటికివాయిదా వేశారు.