రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం…..
***భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు…..
టేకుమట్ల.జూన్25(జనంసాక్షి) రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం మండలంలోని గరిమిళ్లపల్లి,వెంకట్రావ్ పల్లి, ద్వారకాపేట,వెలిశాల, రామకృష్ణాపూర్(వి) గ్రామాల్లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అదికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని అన్నారు. అదేవిధంగా,ఉపాధి హామిలో పేర్లు నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు,రైతుల పంటకు గిట్టుబాటు ధర,ప్రతి గింజను కొంటామ‌న్నారు. ధరలు ముందే నిర్ణయించి, మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామ‌న్నారు. మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు.రైతు కూలీలకు,భూమిలేని రైతులకు భీమా,ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు.అంతేకాకుండా, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామ‌న్నారు.చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామని రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపర అధికారాలతో రైతు కమీషన్, వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్,మండల నాయకులు నాంపల్లి వీరేశం,పెరుమండ్ల లింగయ్య,వైనాల యశ్వంత్,కౌడగాని అనిల్,దా సారపు సదానందం,తోడేటి కుమార్,సుధాకర్ రెడ్డి,ఖాదర్, బండి లింగస్వామి, నారాయణరావు,బండి రవి,ఎంబడి రాయమల్లు,ఎడ్ల రమేష్,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.