172 మంది అధికారులపై సీవీసీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 172 అధికారులపై జరిమానాకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సివీసీ సిఫార్సు చేసింది. అవినీతి మరకలను అంటించుకున్న వారిలో అత్యధికంగా 14 మంది రక్షణ ఉత్పత్తుల విభాగానికి చెందిన వారున్నారు. 12 మంది ఎస్‌బీఐకి, 11 మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ లో పనిచేస్తున్నారు. జూన్‌కు గాను సీవీసీ విడుదల చేసిన పనితీరు నివేదికలో తాజా విషయాలను పొందుపరిచారు. ఈ నెల రోజుల వ్యవధిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో అక్రమాలకు సంబంధించి సీవీసీకి 2,617 ఫిర్యాదులు అందాయి.