18 నుండి 29 సంవత్సరాల వయసు గలవారివి ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లను నమోదు చెయ్యాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 19 (జనం సాక్షి);

18 నుండి 29 సంవత్సరాలు వయస్సు గల వారు అందరు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసి,ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలనీ, శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
బుధవారం ఐ డి ఓ సి సమావేశ హాలు లో జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులచే, నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులకు ఏర్పాటుచేసిన బూత్ స్థాయి అధికారులు, ఫోటో ఎలక్టోరల్ రోల్ 2 వ స్పెషల్ సమ్మరి రివిజన్-2023పై శిక్షణ, అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని, ఈ నెల 27 లోపల పెండింగ్లో ఉన్న ఫామ్స్ అన్నియు పూర్తి చేయాలనీ అన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితానుఇప్పటి వరకే పూర్తి చేశామని, బిఎల్ఓ యాప్ లో వివరాల నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, బి ఎల్ ఓ లు అందరూ ఏఇఆర్ఓ లు చెప్పినట్లు చేయాల్సి ఉంటుందని, బూత్ స్థాయి అధికారులు గరుడ యాప్ ను ఉపయోగించే విధంగా చూడాలని తెలిపారు. ప్రతిసారి చేసే సమ్మరి రివిజన్ లో లోటుపాట్లు సరిదిద్దుకొని ఏ దశలోను తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, లేదా చూసుకోవాలని తెలిపారు. పొలిటికల్ పార్టీ కార్యాలయాలకు 2 కి.మి. దూరంలో, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుండి వివరాలను తొలగించాలన్నారు. అనాధలు, ఒంటరి, కూలీ కొసం ఊరురూ తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్దుల కొరకు ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక కుటుంబం ఒకే ఇంటిలో ఉండే వారందరూ ఒకే పోలింగ్ స్టేషన్ లో ఓట్లు ఉండేటట్లు జాబితా తయారు చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ పై, బూత్ స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్-2023 పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ ,శిక్షకులు నరేష్, తిమ్మారెడ్డి, సుపరింతెన్దేంట్ వరలక్ష్మి, , తహశీల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్లు , డేటాఎంట్రీ ఆపరేటర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.