18 నెలల పాలనపై కాంగ్రెస్ పుస్తకం
– ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్,నవంబర్ 12 (జనంసాక్షి): 18 నెలల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అంతా అవినీతి మయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేసీఆర్ 18 నెలల పాలనపై కాంగ్రెస్ పార్టీనేతలు పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తవమ్ కుమార్ రెడ్డి మాట్ల్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన దీనిని విడుదల చేశారు. 500 రోజుల టీఆర్‌ఎస్ పాలనపై 50 ప్రశ్నల బుక్‌లెట్‌ను వారు విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… ఎన్నికల హావిూలు 10 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు. సీబీఐ విచారణపై కేసీఆర్ మౌనాన్ని వరంగల్ ప్రజలు గమనించాలన్నారు. నక్సల్స్ అజెండా మా అజెండా అన్న కేసీఆర్ శృతి ఎన్‌కౌంటర్‌పై ఎందుకు స్పందించడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనపై పుస్తకంలో 50ప్రశ్నలు సంధించినట్లు చెప్పారు. పుస్తకాన్ని వరంగల్ ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తాము విడుదల చేసిన బుక్‌లెట్‌లోని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్ మంత్రులను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అలాగే బహిరంగ చర్చకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. మోసపూరిత మాటలు తప్ప ఏవిూ చేయలేదని షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్నారు. వరంగల్‌లో ప్రశ్నించిన రైతు కొమురయ్యను జైలులో పెట్టి చిప్పకూడు తినిపిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.