*ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవం*

రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో  ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్   మారు మూల గ్రామాలకు అక్కడి ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమం లో  రాజన్న సిరిసిల్ల జిల్లా  చందుర్తి మండలం , బండపల్లి  గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు ప్రజలు  మాకు ఫ్లోరైడ్ సమస్య    గురించి డాక్టర్   చెన్నామనేని వికాస్  గారి  దృష్టి కి తీసుకరావడం  జరిగింది. వారి అభ్యర్థనకు స్పందించి ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రంని డోనేట్ చేయడం జరిగింది.
ఈ రోజు ఉదయం 11.30 నిముషాల కు ముఖ్య అతితీగా హాజరై  ప్రముఖ వైద్యులు డాక్టర్  చెన్నమనేని వికాస్ HOD of Radiology Dept గారి చేతుల మీదుగా శుద్ధ నీటి జల కేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది
డాక్టర్  చేన్నమనేని వికాస్ గారు మాట్లాడుతూ
అనేక రకాల జబ్బులకు కలుషిత త్రాగు నీరే కారణం  త్రాగే నీరు శుద్ధ జలమై ఉండాలి , ప్రజలంతా  ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యం తో  ఈ మంచి నీటి శుద్ద జల కేంద్రం ను మీ గ్రామానికి డోనేట్ చేయడం జరిగింది అన్నారు, మహిళాలు అన్ని రంగాలలో లో ముందు ఉండాలి అందుకే మా ఫౌండేషన్ నుండి మహిళాల కు ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనోపాధి సహకరిస్తున్నాం అన్నారు, యువత, రైతుల కు    ఆధునిక వ్యవసాయ పనిముట్లు కి కూడా సహకరిస్తాము అన్నారు రైతులు ఏకమై పండించిన పంటల కి ధర నిర్ణయం చేసుకోగలగాలి అంటే రైతులు ఆంతా కలిసి రైతులు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసుకోవలసి ఉన్నది అన్నారు, గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పని చేయాలి అప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమం కు ప్రముఖ డాక్టర్ దీప, జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీ రణధీర్ రెడ్డి దళిత మోర్చా మండల అధ్యక్షులు బాబు,      మహిళా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.