19న ముగియనున్న బాబు పాదయాత్ర?

హైదరాబాద్‌ బ్యూరో
– విశాఖలో భారీ బహిరంగ సభ
తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర షెడ్యూల్‌ కన్నా ముందుగానే ముగియనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 19న పాదయాత్రను ముగించాలని చంద్రబాబు నిర్ణయించినట్తు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాధయాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు సాగవలసి వుంది. మే1న శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా పాదయాత్రను ముగిస్తామని గతంలో టిడిపి ప్రకటించింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ముందుగానే యాత్రను ముగించాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గత ఏడాది అక్టోబర్‌ రెండన చంద్రబాబు ప్రారంభించిన పాదయాత్ర ఏప్రిల్‌ 19వ తేదికి 200 రోజులను పూర్తి చేసుకుంటుంది.
అప్పటికి చంద్రబాబు విశాఖ జిల్లా పర్యాటనలో ఉంటారు. ఆ సందర్బంగా ఏప్రిల్‌ 19వ తేదిన భారీ బహరంగసభను నర్వహించి, యాత్రను ముగించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ నేతలు తులుపడంతో విశాఖ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంపై టీడీపీ సేతలు దృష్టి సారించారు. తరుచు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు, స్థానిక ఎన్నికల కూడా జరుగనున్న నేపథ్యంలో యాత్రను ముగించాలన్న తాజా నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. యాత్ర ముగించిన తరువాత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంఓ పాటు పాదయాత్ర జరగన మిగిలిన జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించే ఆలోచన వుందని పార్టీ వర్గాలు చేబుతున్నాయి.