19వ రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పల్లెబాట 19వ రోజు జోరుగా కొనసాగుతోంది. పల్లెబాటలో టీఆర్‌ఎస్ నేతలు గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. వీధుల్లో జై తెలంగాణ నినాదాలు మర్మోగుతున్నాయి. గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. 28న తెలంగాణ అనుకూలమని చెప్పని పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతామంటున్నారు. తెలంగాణ పట్ల మోసపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న పార్టీలను కొందరు నేతలు వదిలి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.