1915 బస్తాల ఎరువులు సీజ్‌

గుంటూరు, జూన్‌ 28 : అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నా సమాచారం అందుకున్న వ్యవసాయాధికారులు మనగ్రోమోర్‌పై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు. డీలర్‌ వద్ద ఉన్న వివిధ రకాల డిఏపి 28-28 ఎరువుల బస్తాలపై పాతధర కొట్టి వేసి కొత్త ధర ఉన్నట్లు రైతులు మండల వ్యవసాయాధికారిణి ఫిర్యాదు చేశారు. పిఓ వాణిశ్రీ ఇందుకు సంబంధించి డీలర్‌ వద్ద ఉన్న 1915 బస్తాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్‌కు సరకు వచ్చే కంపెనీలోనే కొత్త ధరలను ముద్రించటం జరిగిందన్నారు. నిల్వలున్న ఎరువుల విలువ సుమారు రూ.21 లక్షల 90వేలు ఉంటుందన్నారు. ఎరువుల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. పూర్తి సమాచారం తెలియవలసి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.