2జీ వేలంలో పాల్గొనని సంస్థలు కార్యకలాపాలు నిలిపివేయాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : లైసెన్సులు రద్దయిన, కొత్తగా 2 జీ వేలంలో పాల్గొనని టెలికాం సంస్థలు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైసెన్సుల రద్దు తర్వాత కార్యకలాపాలు సాగించిన సంస్థలు కొత్తవేలంలో నిర్ణయించిన ధర  చెల్లించాలని మార్గదర్శాకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2న ఇచ్చిన ఉత్తర్వులు 900 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రం కలిగి ఉన్న సంస్థలకు వర్తించదని పేర్కొంది. అయితే టాటా టెలీ, యూనినార్‌ సంస్థలు కొత్త వేలంలో పాల్గొనేందుకు నిరాసక్తతను వ్యక్తం చేశాయి.