2వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష
నూతన గ్రామపంచాయతీ కావాలి గ్రామస్తులు*
*వృద్ధులు,వికలాంగులు పెన్షన్ కావాలంటే కిలోమీటర్ పైగా నడవాల్సిందే*
*గతంలో రేషన్ బియ్యం కోసం ప్రాణం పోయింది*
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో కాశీం పూర్ గ్రామ పంచాయతీలో కలిసి ఉన్న గ్రామం మల్కన్ గిరి గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు 2వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాకు అనుబంధ గ్రామంగా ఉండడం వలన నిధులు రావటం లేదు, నిజం పరిపాన కాలం నుండి రెవిన్యూ గ్రామం గా గుర్తింపు ఉన్న జనాభా పరంగా కూడా హర్హత ఉన్న నూతన గ్రామపంచాయతీ గా గుర్తించడం లేదు.మాగ్రమంలో రేషన్ డీలర్ షాపు కావాలి. వృద్ధులు వికలాంగులు పెన్షన్ కావాలంటే ఒక కిలోమీటర్ పైగా నడిచి తీసుకోవాలి. ఒకవేళ వేలిముద్ర రాకపోయినా ఆ నెల పెన్షన్ లేదు. మళ్లీ రెండో నెలకు మారుస్తారు. ఎందుకిలా చేస్తారు అర్థం కాదు.గతంలో కుర్వ మల్లమ్మ కాశీం పూర్ నుండి రేషన్ బియ్యం తీసుకొని మల్కాన్ గిరి మోసుకు వాస్తు కిందపడి మరణించడం జరిగింది.సీ సీ రోడ్లు,మోరిలు లేవు. త్రాగు నీటి సమస్య, కరెంట్ పోల్స్, లైట్స్ లేవు, పాఠశాలలో విద్యారథులకు మూత్రశాలలు లేవు ఎన్నో సమస్యలు ఉన్న మా ఊరు సమస్యల ఊరుగా మారింది. అందుకే గ్రామస్తులందరూ కలిసి రిలే నిరాహారదీక్ష చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల మహిళా సంఘం అధ్యక్షురాలు వినోద అనంతమ్మ,
అనంతయ్య,రవీందర్,శేఖర్, బాలకృష్ణ,మదు,రాజు, బిచప్ప,మనెప్పా,మల్లప్ప,కృష్ణ, నర్సిములు,ఎల్లేశం,
రాజశేఖర్,రమేష్, మహిళలు,గ్రామ పెద్దలు, యువకులు,పాల్గొన్నారు.