సీపీఎం, సీపీఐకి చెరో 2 సీట్లు..!
హైదరాబాద్ : కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఒక్కొక్క సీటు చొప్పున ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం నాలుగు సీట్లను కేటాయించింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలను, సీపీఎంకు భద్రచలం, మిర్యాలగూడెం స్థానాలను కేటాయించింది. భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పినపాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.