20న ఆర్టీసి సమ్మెపై నిర్ణయం

హైదరాబాద్‌: ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు జరిపిన తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. యాజమాన్యం యూనియన్‌కు మధ్య నాలుగో విడత చర్చలు ముగిసాయన్నారు. ఇందులో ఒప్పంద వ్రైడర్లు, కండకర్ల సర్వీసు క్రమబద్దీకరణపై ఎలాంటి హామీ రాలేదని చెప్పారు. కార్మికుల 10డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోందని వివరించారు.