20రాష్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం-60కోట్లమందికి ఇబ్బంది
ఢిల్లీ: ఉత్తర, ఈశాన్య భారతాల్లో పవర్‌గ్రిడ్లు కుప్పకూలటంతో 20 రాష్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడింది. దీంతో 60కోట్లమందికి ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తర భారతంలో-9, ఈశాన్యంలో-4, నార్త్ ఈస్ట్-7 రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా కావటంలేదు. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, హర్యానా, ఢిల్లీ, బీహార్,మూపీ, రాజాస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్,ఒడిశా, అస్సాం, సిక్కిం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని పవర్‌గ్రిడ్ చైర్మన్ తెలిపారు. ఈ రోజు రాత్రి 7గంటల వరకు పరిస్థితిని చక్కదిద్దుతామని అన్నారు. ఢిల్లీ మెట్రోరైళ్ల సర్వీసులను పాక్షికంగా పునరుద్దరించామని చెప్పారు. రాష్ట్రాలు అధిక విద్యుత్‌ను వాడటం వలనే గ్రిడ్‌లు కుప్పకూయని అన్నారు.