20సూత్రాల అమలలో ఆంద్రప్రదేశ్‌ ఆగ్రస్థనంలో ఉంది

హైదరాబాద్‌: 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటేనే ప్రజలు అధికారమిచ్చారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. 20సూత్రాల కార్యక్రమం అమలులో ఆంద్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహల్‌లో 20సూత్రాల కార్యక్రమం అవిర్బావ దినోత్సవానికి సోమవారం ముఖ్యమంత్రి హజరయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి రైతులకు వడ్డీలేని రుణం రూ.లక్ష వరకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఏడాదిలోపు చెల్లించే రుణానికి సంబంధించి అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.