20 సీసీ కెమెరాల ప్రారంభం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వద్ద 20 సీసీ కెమెరాలను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఒక్క నిఘా కెమెరా చేసే పనిని వంద మంది కానిస్టేబుల్స్ చేయాల్సి వస్తుందని సీపీ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతలు, ప్రజారక్షణ పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు సీపీ.