2011-12 టీవీ నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: ప్రభుత్వం బుల్లితెరకు నంది అవార్డులను ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 2011-12 సంవత్సరానికిగాను టెలివిజన్‌ నంది అవార్డులను ప్రకటిస్తున్నట్టు మంత్రి డీకే అరుణ తెలిపారు. టీవీ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ సీరియాళ్లు-పసుపు-కుంకుమ,మమతల కోవెల

ఉత్తమ టెలీఫిల్మ్‌ – నాభూమి, ఉత్తమ సామాజిక సీరియల్‌ – చిట్టెమ్మ కథ, ఉత్తమ టీవీ డాక్యూమెంటరీనాగోబా జాతర.

ఉత్తమ కథా రచయిత – సుమన్‌ (మమత), ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్‌ – పంచతంత్రం, ఉత్తమ టెలీఫీచర్‌ – అదుర్స్‌, ఉత్తమ గాయకుడు – కార్తిక్‌ (ఆకాశగంగ), ఉత్తమ మహిళా యాంకర్‌ ఝాన్సీ (ఏటీఎం), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్టు -మురళీ (లంత:పురం), ఉత్తమ దర్శకుడు – అనిల్‌కుమార్‌ (మనసు-మమత), ఉత్తమ నటుడు – శ/భలేఖ సుధాకర్‌ (మనసు-మమత), ఉత్తమ నటి – పల్లవి (భార్యామణి), ఉత్తమ సహాయనటుడు – జయరాం ఆధారం), ఉత్తమ హాస్యనటుడు – రామ్‌ జగన్‌ (చూడుచూడు తమాష), ఉత్తమ హాస్యనటి – శ్రీలక్ష్మీ (నేనే మీ అల్లుడు), ఉత్తమ ప్రతినాయకి – లావణ్య లహరి (అంత:పురం), స్పెషల్‌ జ్యూరీ అవార్డు – కేవీ రెడ్డి (కుంకుమరేఖ), ఉత్తమ సంగీత దర్శకుడు – ఖుదేష్‌ (ఎగిరే పావురమా).