2012 ఇండోనేషియా టైటిల్‌ సైనా నెహ్వల్‌దే!

జకార్తా జూన్‌ 17 భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సీరిస్‌ ప్రీమియర్‌లీగ్‌ టోర్నమెంట్‌ లో విజేతగా నిలిచింది.మహిళ ల సింగిల్స్‌ టైటిల్‌ ను సోంతం చేసుకుంది.ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ జూరుయ్‌ లీ (చైనా) ను 13-21,22-20,21-19 తేడాతో ఓడించింది.హెరాహోరీగా సాగిన ఫైనల్లో మొదటి సెట్‌ గెల్చుకున్న సైనా రెండో సెట్‌లో వెనుకబడింది.ఐతే మూడో సెట్‌ లో సైనా పుంజుకుని ప్రత్యర్థి జురుయ్‌లీ ని ఓడించి విజేత గా అవతరించింది.ఈ హైదారాబాదీ షట్లర్‌ 2009 ,2010 లోనూ ఇండోనేషియా ఓపెన్‌ ఛాంపియన్‌ గా నిలిచింది.ఈ ఏడాది స్విట్జార్లాండ్‌ ,థాయ్‌లాండ్‌ ,ఇండోనేషియా టైటిల్స్‌ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్‌ సత్తా చాటింది.ఈ ఏడాది కూడా సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సీరిస్‌ ను సోంతం చేసుకోవడం మూడోవసారి ఈ టైటిల్‌ ను గెల్చుకున్న క్రీడాకారిణి గా రికార్డు సృష్టించింది.అంతక ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా శనివారం జరిగిన సెమీస్‌ పోరులో ఆన్‌సీడెడ్‌ కోరియా షట్లర్‌ జి హ్యూస్‌ సంగ్‌పై 22-20,21-18 తొ జయభేరి మోగించింది.ఈమెతో ముఖాముఖీ రికార్డులో సైనా 1-4 తో వెనుకబడి ఉంది.పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ పారుపెల్లి కశ్యప్‌ కాంస్య పతకంతో సంతృప్తి పడ్డాడు. సెమీఫైనల్లో కశ్యప్‌ 15-21,12-21,తో ఏడో సీడ్‌ సిమోన్‌ సాంతోసో (ఇండోనేషియా)చేతి లో ఓడిపోయాడు.సూపర్‌ సీరిస్‌ టోర్నమెంట్లలో కశ్యప్‌ కిది మూడో కాంస్య పతకం కావడం విశేషం.గతంలో 2010 సింగపూర్‌ సూపర్‌ సీరిస్‌ 2012 ఇండియన్‌ ఓపెన్‌ సీరిస్‌ టోర్నీలలో కశ్యప్‌ కాంస్య పతకాలు గెల్చుకున్నాడు.క్వార్టర్‌ ఫైనల్లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి షిజియాన్‌ వాంగ్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న సైనా అదే జోరును సెమీ ఫైనల్లో ను కనబరిచింది.గతంలో జీ హున్‌ సుంగ్‌తో ఆడిన మూడు సార్లు నెగ్గిన సైనా నాలుగోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.తోలిగేమ్‌ లో 5-1 తో ముందంజ వేసిన ఈ హైదారాబాదీ ఆ తర్వాత స్థిరంగా పాయింట్లు సాధిస్తూ 17-13 తో ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో రెండోసీడ్‌ జిన్‌వాంగ్‌ (చైనా) ఆరోసీడ్‌ యాన్‌జియాంగ్‌ జియావో (చైనా) లను ఓడించిన జీ హున్‌ సుంగ్‌ నెమ్మదిగా తేరుకుని వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17-17 వద్ద స్కోరును సమం చేసింది.షిజియాన్‌ వాంగ్‌తో శుక్రవారం తన కెరీర్‌లోనే సుధీర్ఘ మ్యాచ్‌ ఆడి రికార్డు నెలకోల్పిన సైనా పట్టువదలకుండా పోరాడి వరుసగా మూడుపాయింట్లు సాదించి తోలిగేమ్‌ ను సోంతం చేసుకుంది.50 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సైనా వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సోంతం చేసుకుంది.తోలిగేమ్‌లో 2-0 తో శుభారంభం చేసిన హైదారాబాదీ అదే జోరు కోనసాగిస్తూ 16-9 అధిక్యం ప్రదర్శించింది.ఆనక ప్రత్యర్థి నుంచి పోటి ఎదుర వడంతో 19-20 తో వెనకబడింది.ఈ దశలో పుంజుకు న్న సైనా వరుసగా పాయింట్లు గెలిచి గేమ్‌ను కైవసం చేసుకుంది.ఇక రెండో గేమ్‌లో ఓదశ లో కోరియా షట్లర్‌ 16-31 తో ముందంజ వేసిన సైనా మళ్లీ విజృంభించి మ్యాచ్‌ను వశం చేసుకుంది.