2014 వరకూ కిరణ్‌కుమర్‌ రెడ్డి సీఎంగా ఉంటారు: బొత్స

విశాఖపట్నం: విశాఖ మన్యంలో బాక్సైట్‌ గనుల లీజులను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ప్రభుత్వం బాక్సైట్‌ లీజులను కేటాయించిందని, జాతీయ ప్రయోజనాల రీత్యా కేంద్రం వాటిని రద్దు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. 2014 వరకూ కిరణ్‌కుమార్‌ రెడ్డే సీఎంగా ఉంటారని బొత్స చెప్పారు.