2014 వరకు కిరణే ముఖ్యమంత్రి – తెలంగాణపై సోనియా ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే

2014 వరకు కిరణే ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : నవంబర్‌ 6, (జనంసాక్షి):
2014 వరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి వాయలార్‌ రవి మంగళవారం  మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. కిరణ్‌ను మార్చల్సిన అవసరం ఏమాత్రం లేదని, మార్పు చర్చ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం మధ్య ఇంతవరకు జరగలేదన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.
తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చేబుతున్నారని అన్నారు. అందరి అభిప్రాయాలను తాను తీసుకొని తమ పార్టీ అధీనేత్రి సోనియా గాంధీకి చేరవేస్తున్నారని చెప్పారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షురాలే అని అన్నారు. తమను తెలంగాణ ప్రాంత నేతలు పలువురు కలిశారని ఎవరు ముఖ్యమంత్రి మార్పు పైన చర్చించలేదని, కేవలం తెలంగాణను పరిష్కరించాలని మాత్రమే కోరారని తెలిపారు.
రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహ పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.