2014 వరకు సీఎంను మార్చం: వాయలార్
ఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని కేంద్రమంత్రి , ఏఐసీసీ ప్రతినిధి వాయలార్ రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పిస్తారని వస్తున్న వార్తలను వాయలార్ రవి తోసిపుచ్చారు. సోనియా, ఆజాద్‌ల ముందు సీఎం మార్పు చర్చ రాలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తనను కలిసారని వారు తమ ప్రాంత సమస్యలను చెప్పారని ఆయన వివరించారు.