2017 నాటికి మిగులు విద్యుత్: కేసీఆర్
మణుగూరు, మర్చి 28: 2017 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మణుగూరులో థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఆయన శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ ప్లాంట్‌ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. భద్రాచలాన్ని మరింత అభివృద్ధి పరిచి, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గోదావరి నదీతీరాన్ని సుందరంగా తయారుచేయాల్సిన అవసరం ఉందన్నారు.