21న సడక్‌బంద్‌ను నిర్వహించి తీరుతాం : కోదండరాం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ – కర్నూలు రహదారిపై ఈ నెల 21న సడక్‌బంద్‌ను నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఆ రోజు ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే సడక్‌బంద్‌ను విరమించుకునేవాళ్లమని చెప్పారు.