21న హక్కుల కమిషన్‌ ఓటింగ్‌

వాషింగ్టన్‌ : తమిళ తిరుగుబాటుదారుపై శ్రీలంక సాగించిన అకృత్యాలు, పౌరుల సామూహిక ఊచకోతకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన హామీలు నిలుపుకోవాల్సిందిగా కోరే తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ ఓటింగ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకలో పౌరులపై కొనసాగుతున్న అత్యాచారాల పరంపరపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆందోళనను కూడా ఈ తీర్మానం వ్యక్తీకరించనుంది. అమెరికా ప్రవేశపెడుతున్న ఈ తీర్మానంపై గురువారం ఓటింగ్‌ జరగనుంది.