21 అక్టోబర్ నుంచి కాయన్‌వెల్త్ యూత్ సమావేశాలు: నాదెండ్ల మనోహర్
హైదరాబాద్, జనంసాక్షి: అక్టోబర్ 21 నుంచి హైదరాబాద్‌లో కామన్‌వెల్త్ యూత్ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సమావేశాలకు 54 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్న 66 మంది, వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా యువ ప్రతినిధులు హాజరవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.