ఎస్సీ వర్గీకరణ చేయకపోతే బీజేపీ భూస్థాపితం అవుతుంది
గుడిహత్నూర్:మార్చ్ 4 (జనం సాక్షి).ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితం కాక తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ అన్నారుమాదిగల సంగ్రామ పాదయాత్ర మూడో రోజు శనివారం మన్నూర్ గ్రామానికి చేరుకుంది. ఈ యాత్రకు గ్రామ కుల పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా నిలబడుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీలలో ఉన్న 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయని అన్నారు.ఇది అంబేద్కర్ ఆశయమని అన్నారు. కానీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేయకుండా 59 ఎస్సీ ఉప కులాలకు ద్రోహం చేస్తుందని అన్నారు.2014 ఎన్నికల సమయంలోనే దేశంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ అని హామీ ఇచ్చి 9 ఏండ్లుగా అధికారంలో ఉండి కూడా ఆ హామీని నెరవేర్చకుండా దారుణంగా మోసం చేస్తోందని అన్నారు. గత 28 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే చేస్తామని నమ్మించి తీరా అధికారంలోకి వచ్చాక ద్రోహం చేయడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిద