22న చలో రాజోలు: తెలంగాణ జేఏసీ పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగు పెట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ హెచ్చరించింది,అంత వరకు సీమాంధ్ర బాబు తెలంగాణలో పర్యటన జరిపేదిలేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఈ నెల 22న ‘చలో రాజోలు’ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. బాబు పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.