22న ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖాముఖి
సంగారెడ్డి,జనవరి20: ఆర్టీసీ సంస్థలో 2011లో శ్రామిక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారు ఈనెల 22న ఉదయం 9.00 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ సివిల్ ఇంజినీరింగ్ కార్యాలయంలో హాజరు కావాలని ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. నూతన అభ్యర్థులకు కాకుండా ఇది వరకు దరఖాస్తులు చేసుకున్న వారు మాత్రమే హాజరుకావాలని సూచించారు