23న ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రధానం
హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చేఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డులను హైదరాబాద్‌లో ప్రకటించారు. 21 విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 18 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తమ ఉత్పత్తులకు సామాజిక ఉపయోగాన్ని జోడించే సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఇందులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత నిచ్చినట్లు అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 23న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను అందించినట్లు ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి ఎం.వి.రాజేశ్వరరావు తెలిపారు. అగ్ని -5క్షిపణి తయారీలో ముఖ్యపాత్ర పోషించిన శాస్త్రవేత్త సతీష్‌రెడ్డి అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ అవార్డుతో ప్యాప్సీ సత్కరించనుంది.