కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటా.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5, (జనంసాక్షి )
బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల కేంద్రంలో అనారోగ్యం మరణించిన పెండ్యాల విశ్వనాధం, దాసరి నారాయణ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏకష్టం వచ్చినా తనను సంప్రదించలన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీటీసీ సిరంగి శంకర్, సింగల్ విండో చైర్మన్ దత్తు మూర్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దత్తాత్రేయ, కో అప్షన్ సభ్యుడు రెహ్మత్ ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ సాగర్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.