కల్వచర్ల బావుల్లో క్లోరినేషన్ చర్యలు

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో సర్పంచ్ గంటా పద్మ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో వర్షాకాలంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున చేతబవుల్లో వర్షం నీరు వచ్చి చేరుతుండడంతో కలుషిత నీటిని నివారించేందుకు గ్రామంలోని అన్ని బావులలో బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేం కనకయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.