పోషకాహారంతోనే ఆరోగ్యం

– జడ్పిటిసి చిన్ననశెట్టి వరలక్ష్మి
అశ్వారావుపేట, సెప్టెంబర్ 6( జనం సాక్షి )
ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుంటే ఆరోగ్య వంతులుగా ఉంటారని జడ్పిటిసి చిన్నం శెట్టి వరలక్ష్మి అన్నారు. పోషకాహార వాత్సవాల్లో భాగంగా బుధవారం నాడు నారాయణపురం లోని అంగన్వాడి సెంటర్లలో పోషకాహార అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి చి న్నంశెట్టి వరలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి హాజరయ్యారు. గర్భిణీలు బాలింతలు రక్తహీనతకు లోనవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోషకాహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలని జడ్పిటిసి తల్లులకు సూచించారు. అనంతరం సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే పోషకాహారం ఆకుకూరలు కూరగాయలు మన ఇంటి ఆవరణలోనే పండించుకోవచ్చని అన్నారు. అవి తినటం ద్వారా తక్కువ ఖర్చుతోనే మనకు పోషకాహారంఅందుతుందని పల్లులకు వివరించారు. పోషకాహార విలువలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రత్యేకతను వివరించారు. గర్భవతులకు సీమంతాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు అన్నప్రాసన వేడుకలను చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎస్ బి టి ఎస్ లక్ష్మి, జె నాగమణి ఎస్ సావిత్రి బి రాధ బి రాణి బి వెంకటలక్ష్మి బి వెంకయ్యమ్మ ఆశాలు కే లక్ష్మి ఎస్ సావిత్రి తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

 

 

తాజావార్తలు