మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికం

మోత్కూరు సెప్టెంబర్ 11 జనంసాక్షి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ను ఆంధ్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని టిడిపి మోత్కూర్ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు దామరోజ్. సత్యనారాయణ చారి, ఎండి. గాలిబు లు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వము మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. చంద్రబాబుపై బనాయించిన తప్పుడు కేసులను బేజారతుగా పోలీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పై మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 28 కేసులు పెట్టి నిరూపించలేకపోయారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి చంద్రబాబు నాయుడు కేసులపై మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిడిపి అగ్ర నాయకులపై ,పార్టీ శ్రేణులపై పోలీస్ కేసులు బనాయించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

తాజావార్తలు