జనగామలో ముదురుతున్న బి ఆర్ ఎస్ వర్గ పోరు…. ముత్తిరెడ్డి ఫ్లేక్సీ చింపివేసిన….?

జనగామ ప్రతినిధి (జనంసాక్షి) సెప్టెంబర్ 15, : జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫ్లేక్సీ లు ఏర్పాటు చేసారు….. కానీ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కటౌట్ గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో స్థానిక నేతలలో తీవ్ర కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం వర్గాలుగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేయడం తెలిసిందే.. జనగామ బీఆర్ఎస్ పార్టీలో కూడా వర్గాలుగా ఏర్పడి సమీక్షలు, సమావేశాలు పెట్టినది విధితమే..కానీ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా వెలసిన కటౌట్ చినగడం వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉన్నది.. ఏది ఏమైనా జనగామ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా పనిచేస్తున్నట్లు అక్కడక్కడ బహిర్గతం కావడం కలకలం సృష్టిస్తున్నా అంశం

 

 

తాజావార్తలు