కాంగ్రెస్, బి జె పి నాయకుల అక్రమ అరెస్ట్
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 16 (జనం సాక్షి);పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతకానికి ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి ని అడ్డుకుంటారని నెపముతో జోగులాంబ గద్వాల జిల్లా ఆయా మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్రెస్, బిజెపి నాయకులను శనివారం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో ఉంచడం జరిగింది.
జిల్లాలో ని వడ్డేపల్లి మండల కేంద్రం పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ నాయకులు శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు వడ్డేపల్లి కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టిపిసిసి ఎస్సీ సెల్ సెక్రెటరీ వడ్డేపల్లి దేవేంద్ర మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వెయ్యకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నందున ప్రాజెక్టులో ఒక దర్శనం మాత్రమే పూర్తిచేసి ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి కి సిగ్గు అనిపించడం లేదా అని ఆయన అన్నారు. ఎలక్షన్ వస్తుంది అనగానే ప్రారంభోత్సవాలు చేసి తర్వాత పట్టించుకుని టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. రానున్న ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తున్నారనారు.అరెస్ట్ అయిన వారిలో.కాంగ్రెస్ పార్టీ రాష్ట ఎస్సీ సెల్ కార్యదర్శి దేవేంద్ర,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు డి . నాగశిరోమణి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు యనమల నాగరాజు,వడ్డేపల్లి టౌన్ ప్రెసిడెంట్ చిన్నరామాన్,
జులకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయశంకర్,
వడ్డేపల్లి టౌన్ బి సి సెల్ అధ్యక్షుడు కె .రాముడు, వడ్డేపల్లి టౌన్ బి సి సెల్ కార్యదర్శి బి.నరసింహ నాయుడు, ఉప్పరి మహేష్ వున్నారు.