సీఎం కేసీఆర్ సభకు తరలి వెళ్లిన ,బిఆర్ఎస్ నేతలు

వనపర్తి బ్యూరో సెప్టెంబర్16 (జనం సాక్షి)

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రం నుండి మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నేతలు కొల్లాపూర్ నియోజక వర్గంలోని నార్లపూర్ వద్ద జరిగే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు..మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ జెండా వూపి సిగ్నల్ ఇవ్వగా బస్సులలో..ప్రత్యేక వాహనాల్లో సీఎం సభకు వెళ్లారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి,కొండారెడ్డి,చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,హోటల్ రాములు యాదవ్,ఖాజా మైనోద్దిన్,కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్,తహసీన్ వహీద్ అలీ,సింగిల్ విండో డైరెక్టర్ చాపల జేసిబి భాస్కర్,కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ శంకర్ యాదవ్,మాజీ మార్కెట్ డైరెక్టర్ తిమ్మన్న యాదవ్,ఐటిఐ కార్యదర్శి ఎండి మజీద్,పట్టణ ఉపాధ్యక్షులు ఎండి బాబా,బిఆర్ఎస్ నేతలు వినోద్ సాగర్,బాలే మియా,లక్ష్మన్న గారి రవీందర్ రెడ్డి,బీడీ ఫ్యాక్టరీ గౌస్ తదితరులు సీఎం సభకు తరలి వెళ్లారు.ఇదిలా ఉండగా పట్టణం నుండి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులలో మహిళలు తరలి వెళ్లారు.