పద్మశాలి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 16 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలి యువత ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయకులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే రసాయనిక సామాగ్రితో చేసిన వినాయకులను వాడరాదని మట్టితో తయారు చేసిన వినాయకులను వాడితే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువత తదితరులు పాల్గొన్నారు.