దేశంలో ఇంజనీర్లదే ప్రముఖ పాత్ర…
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి
జనంసాక్షి, కమాన్ పూర్ : దేశంలో ఏదైనా నిర్మాణం చేయడంలో ప్రముఖ పాత్ర ఇంజనీర్లది అని కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదర్శనగర్ లో సాన రామకృష్ణ రెడ్డి ఎస్టేట్లో పలువురు ఇంజనీర్లకు లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఇందులో సింగరేణి సంస్థ ఓసిపి 1 పిఓ రాధాకృష్ణ ఇంజనీర్లు రామ్ రెడ్డి ఎర్రన్న నరసింహారావు దాసరి అనిల్ కుమార్ నీలి శ్రీనివాస్ పూదరి సంతోష్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన నిరాడంబరత భారత జాతికి చేసిన అంకితభావం వల్ల ఆయనకు భారతరత్న అవార్డు లభించిందని అన్నారు. మన దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణంలో కీలకపాత్ర వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సదాశియ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రవణ్ కుమార్ లింగమూర్తి. లైన్స్ క్లబ్ సభ్యులు పెన్ రెడ్డి కిషన్ రెడ్డి మచ్చ గిరి రాము బండ సాయి శంకర్ శివ శంకర్ జబ్బార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.