బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు పొందుర్తి నాయకులు

రాజంపేట్ సెప్టెంబర్ 16 (జనంసాక్షి)కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామం బిజెపి యూత్ అధ్యక్షులు నర్సింలు ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు, రాష్ట ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ చేరారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు చూసి అధికార పార్టీలో చేరుతున్నట్టు ప్రభుత్వ విప్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బలవంతరావు, మండల రైతు బంధు అధ్యక్షులు జుక్కంటి మోహన్ రెడ్డి, రాజంపేట్ సహకార సంఘం అధ్యక్షులు నల్లవెల్లి అశోక్, పొందుర్తి గ్రామ సర్పంచ్ గంగ కిషన్, ఎంపీటీసీ బాలరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు లింగాల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.